2023-24లో అధికార భారతీయ జనతా పార్టీ అత్యధికంగా రూ.2,604 కోట్ల విరాళాలను సేకరించింది. దేశంలో రెండవ పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ రూ.281.38 కోట్లు విరాళాలు అందుకుంది. ఎన్నికల సంఘం వెబ్సైట్లో ఈ వివరాలను ఉంచింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ విరాళాలొచ్చాయని వెల్లడించింది. అయితే ఇవి ఎలక్టోరల్ బాండ్ల విరాళాలు కాకుండా వాటిని స్వయంగా పార్టీలు వెల్లడిస్తాయి.
ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్టు ద్వారా బీజేపీ రూ.723 కోట్లు, కాంగ్రెస్ రూ.150 కోట్లు విరాళాలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీకి సోనియా, రాహుల్, ప్రియాంక, కేసీ వేణుగోపాల్, దిగ్విజయ్ సింగ్ తదితర సీనియర్ నేతలు రూ.138 లక్షల చొప్పున విరాళాలందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.11.06 కోట్లు, సీపీఎంకు రూ.7.64 కోట్ల విరాళాలొచ్చాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు