సీఎం చంద్రబాబు..!
మాజీ ప్రధాన మంత్రి, ప్రఖ్యాత ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ జీ మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. “మేధావి రాజనీతిజ్ఞుడు, వినయం, జ్ఞానం, కలగలిపిన వ్యక్తి. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించి లక్షలాది మందిని ఉద్ధరించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి అని పోస్టు పెట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి..!
మన్మోహన్ సింగ్ గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాది. ఆయన తీసుకున్న అసామాన్య నిర్ణయాల్లో మానవతా దృక్పథం కూడా ఒకటి. మన్మోహన్‌సింగ్.. అసలైన నవభారత నిర్మాత. భరతమాత ఓ గొప్ప కుమారుడిని కోల్పోయింది అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు.
దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కించిన నేత: పవన్ కల్యాణ్
“భారత దేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దివంగతులయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను.వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.భారత దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు ఆద్యుల్లో ఒకరు మన్మోహన్ సింగ్.రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా, యూజీసీ ఛైర్మన్ గా విశిష్ట సేవలందించిన ఆయన ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.శ్రీ మన్మోహన్ సింగ్ హయాంలో చేపట్టిన సంస్కరణల వల్ల ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కింది.ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.మన్మోహన్ సింగ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అని ఓప్రకటన విడుదల చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్