భారత రక్షణా రంగ పరిశోధనా సంస్థ (డీ.ఆర్.డీ.ఓ) గగనతల సాంకేతికతకు సంబంధించిన స్వదేశీ పరిజ్ఞానం అభివృద్ధిలో కీలక ముందడుగు వేసింది. దశాబ్దాలుగా కొనసాగుతున్న కావేరీ ఇంజన్ ప్రాజెక్టుకు సంబంధించి పరీక్షలకు కావేరీ ఇంజన్ సిద్ధమైందని ప్రకటించింది. డీ.ఆర్.డీ.ఓ పరిధిలోని గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిషమెంట్(జీ.టీ.ఆర్.ఈ) ఈ ఇంజన్ ను అభివృద్ధి చేసింది.
ఇక ఈ ఇంజన్ ల నేపథ్యానికి వెళితే యుద్ధవిమానాలకు అవసరమైన ఇంజన్లను స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించుకోవాలన్న లక్ష్యంతో కావేరీ ఇంజన్ ప్రాజెక్టు 1980లో ప్రారంభమైంది. ఆ తర్వాత నాలుగు దశాబ్దాల కాలంలో అనేక సవాళ్లను చూసింది వాటిని అధిగమించి చివరకు స్వదేశీ విమాన ఇంజన్ రానుంది.
తదుపరి దశలో భాగంగా కావేరీ ఇంజన్ ను పలు విమానాల్లో, పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పరీక్షించనున్నారు. వాటిలో సైతం విజయవంతమైతే విమాన ఇంజన్ల కోసం విదేశాల మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. భారత రక్షణ రంగ పరిశోధనల్లో ఇదొక మైలురాయిగా నిలవనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు