మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన విషయం విదితమే. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. అవిశ్రాంతంగా దేశానికి సేవలందించారని కొనియాడారు. అనేకపదవులు సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. గొప్ప దార్శనికుడిని కోల్పోయామని అన్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, ఎంపీలు బైరెడ్డి శబరి, కేశినేని శివనాధ్ తదితరులు ఉన్నారు.
ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం. గొప్ప దార్శనికుడిని కోల్పోయాం. #ChandrababuNaidu pic.twitter.com/ZxlVN615do
— Telugu Desam Party (@JaiTDP) December 27, 2024