నాలుగు దశాబ్దాల క్రితం 1984 డిసెంబరు 3న డిసెంబరు 2 అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. దేశ చరిత్రలో అత్యంత విషాదకర దుర్ఘటన గా పేర్కొంటారు.
భోపాల్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ సంస్థ ఆవరణలో దాదాపు 40 ఏళ్లుగా పడివున్న 377 టన్నుల విషపదార్థాల తరలింపు కార్యక్రమం మొదలైంది. జీపీఎస్ అమర్చిన పలు ట్రక్కులు, అత్యంత పటిష్టంగా తయారుచేసిన కంటైనర్లతో అక్కడి నుండి తరలిస్తున్నారు. పీపీఈ కిట్లు ధరించిన సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, డాక్టర్లు, నిపుణులు అక్కడికి చేరుకొన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో పోలీసు బలగాలను మోహరించారు. వీటిని ఇండోర్ సమీపంలోని పీతంపుర్ ప్రాంతానికి తరలించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే ఈ వ్యర్థాల తరలింపులో ఆలస్యంపై రాష్ట్ర అధికారులకు కోర్టు మొట్టికాయలు వేసింది. దీంతో అధికార వర్గాల్లో కదలిక వచ్చింది. వీటిని తరలించడానికి నాలుగువారాల డెడ్లైనన్ విధించింది.
ఈ విషాదకర ఘటన నేపథ్యం ఏంటంటే భోపాల్ నగర శివార్లలోని యూనియన్ కార్బైడ్ పురుగుమందుల కర్మాగారంలోని ట్యాంకు నుండి 40-45 టన్నుల అత్యంత ప్రమాదకర మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ లీకైంది. పరిసరాలను అది గ్యాస్ ఛాంబర్లుగా మార్చేసింది. ఎంతోమందికి విషవాయువు ఊపిరితిత్తుల్లోకి చేరింది. హాస్పిటల్స్ కు పరుగులు తీస్తూ చాలామంది రోడ్లపైనే ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్ లీకేజీ కారణంగా మొదటి 3 రోజుల్లో దాదాపు 10 వేలమంది మరణించినట్లు మొత్తంగా పాతిక వేలమంది వరకు మరణించినట్లు అంచనా వేశారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

