దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో కీలక రంగాల షేర్లలో మదుపర్లు అమ్మకాలకు ఆసక్తి చూపడంతో సూచీలు నష్టాల బాట పట్టాయి.
బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 450.94 పాయింట్ల నష్టంతో 78,248 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 168.50 పాయింట్ల లాభంతో 23,644 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 85.51గా కొనసాగుతోంది. నేటి ట్రేడింగ్ లో టెక్ మహీంద్రా, జొమాటో, సన్ ఫార్మా, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్.సీ.ఎల్ టెక్నాలజీస్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Articleఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ మరో కీలక ప్రకటన
Next Article ఇకపై అక్కడ నో కిటికీలు: తాలిబన్ ప్రకటన