ఈ ఏడాది ప్రారంభ రోజైన నేడు కేంద్ర కేబినెట్ మొదటి సమావేశం జరిగింది. ఈ సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశాన్ని ప్రధాని నరేంద్రమోడీ రైతులకు అంకితం చేసినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైతుల సంక్షేమం గురించి ప్రధానంగా ఈ కేబినెట్ భేటీలో చర్చ జరిగిందన్నారు.
ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను మరింతగా మెరుగుపరచే దిశగా కేంద్ర కేబినెట్ నిర్ణయించిందని తెలిపారు. ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను రూ.69,515 కోట్లకు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. ఇక 50 కిలోల డీఏపీ ఎరువుల బస్తాను రూ.1,350 చొప్పున రైతులకు అందించేందుకు రూ.3,850 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ గురించి కేంద్రమంత్రి వివరించారు.
కేబినెట్ సమావేశం గురించి ప్రధాని మోడీ ట్వీట్:
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మన దేశాన్ని పోషించడానికి కష్టపడి పనిచేసే మన రైతు సోదర, సోదరీమణులందరి పట్ల గర్విస్తున్నామని 2025 మొదటి క్యాబినెట్ మన రైతులకు శ్రేయస్సును పెంపొందించడానికి అంకితం చేయబడిందని తెలిపారు. ఈ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నందుకు సంతోషిస్తున్నట్లు ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
ఈ ఏడాది మొదటి కేబినెట్ సమావేశం:రైతుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు
By admin1 Min Read
Previous Articleలాభాలతో ఏడాదిని ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు
Next Article న్యూ ఇయర్ వేడుకలు.. రూ.89 లక్షల జరిమానాలు