దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరంలో కొత్త ఏడాది సంబరాలు వేళ చాలా మంది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారు.ఒక్క రాత్రిలోనే 17,800 వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించినట్లు పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు బుధవారం ఉదయం వరకూ స్పెషల్ డ్రైవ్ లను నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధన ఉల్లంఘించిన వారి పై మొత్తం రూ.89.19 లక్షలను జరిమానాల రూపంలో విధించినట్లు ప్రకటించారు.మితిమీరిన వేగంతో వాహనాలు నడపడం,సిగ్నళ్లు జంప్ చేయడం, డ్రంకన్ డ్రైవ్ కేసులు వీటిల్లో ఎక్కువగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Previous Articleఈ ఏడాది మొదటి కేబినెట్ సమావేశం:రైతుల సంక్షేమానికి కీలక నిర్ణయాలు
Next Article పెరిగిన భారత్ సముద్ర తీరం పొడవు…!