దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఈ మేరకు ఆమ్ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ
పై తీవ్ర విమర్శలు చేశారు.ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆ పార్టీ డబ్బు పంచుతుందని ఆరోపించారు.దీన్ని ఆరెస్సెస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు.అయితే ఆయన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌కు లేఖ రాశారు.
‘ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ
నేతలు బహిరంగంగా డబ్బులు పంచుతున్నారు.ఓట్ల కొనుగోలును ఆరెస్సెస్ సమర్థిస్తుందా?ప్రజాస్వామ్యానికి ఇది సరైనదని మీరు భావిస్తున్నారా?.ఆ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తోందని మీకు అనిపించడం లేదా?’ అని భాగవత్‌ను కేజ్రీవాల్ ప్రశ్నించారు.