హెచ్1బీ వీసా అంశం పై అమెరికాలో విస్తృత చర్చ జరుగుతోంది.అమెరికాకి కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై స్పందించారు.అమెరికాకు సమర్థవంతులైన వ్యక్తులు కావాలని ఎప్పుడూ భావిస్తుంటానని అన్నారు.మన దేశానికి సమర్థత కలిగిన ప్రజలు కావాలని నేను ఎల్లప్పుడూ భావిస్తాను.తెలివైనవారు మన దేశానికి రావాలి. మునుపెన్నడూ లేని స్థాయిలో మనకు ఉద్యోగాలు రాబోతున్నాయి’’ అని కొత్త సంవత్సరం సందర్భంగా మీడియాతో మాట్లాడారు.అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా ఏర్పాటుచేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE)కి సంయుక్త సారథులుగా నియమితులైన మస్క్,వివేక్ రామస్వామి గతంలో ఈ అంశంపై తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. యూఎస్ తక్కువ స్థాయిలో నైపుణ్యం గల గ్రాడ్యుయేట్‌లను తయారుచేస్తున్నందున ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం గలవారిని దేశంలోకి అనుమతించడానికి హెచ్1బీ వీసా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.టాలెంట్ ఎక్కడున్నా దానిని అందిపుచ్చుకోవాలన్నారు.ప్రపంచ దేశాల్లో అమెరికా ఎప్పటికీ మొదటిస్థానంలో ఉండాలంటే ఈ ప్రోగ్రాంకు మద్దతివ్వాలని కోరారు.
Previous Articleమోహన్ భగవత్ కు కేజ్రీ వాల్ లేఖ…!
Next Article వాట్సప్ వేదికగా ఎక్కువ మోసాలు..!