ఈనెల 13 నుండి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు జరుగనున్న మహా కుంభమేళా కోసం ప్రయాగ్ రాజ్ సిద్దమవుతోంది. ప్రభుత్వం అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 40 కోట్ల మందికి పైగా ఈ మహా కుంభమేళాకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. భద్రత కోసం పారా మిలటరీ బలగాలు సహా 50 వేల మంది సిబ్బంది మరియు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఉత్తరాదిలో ఇటీవల మంచు భారీగా కురుస్తున్న నేపథ్యంలో భక్తులకు అక్కడ వాతావరణం పై ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్ సైట్ లో ప్రత్యేక పేజీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రతి 15 నిమిషాలకు వచ్చే మార్పులు సందర్శకులు తెలుసుకోవచ్చని ఐఎండీ డైరెక్టర్ మనీష్ రణాల్కర్ తెలిపారు. రోజుకు రెండు సార్లు వాతావరణ సూచనలు అందులో జారీ చేయనున్నట్లు వివరించారు. ఇందుకోసం మహా కుంభమేళా జరిగే ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించినట్లు తెలిపారు. ఇక మహా కుంభమేళాలో భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 లక్షల టెంట్లు, 1.5 లక్షల టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ లు, వాటర్ డ్రోన్స్ కూడా ఇటీవల పరీక్షించిన సంగతి తెలిసిందే.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు