ఎపి-మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ ను ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ నేడు ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో అంతర్జాతీయంగా వస్తున్న మార్పులపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ సంస్థ ఇన్ఫోసిస్ సహకారంతో దీనిని ప్రారంభించారు.
పైలట్ ప్రాజెక్టుగా ఈ వాహనం మంగళగిరిలోని స్కూళ్లకి వెళ్లి పిల్లల్లో అవగాహన కల్పిస్తుంది. ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు ఇటువంటి వాహనాలను పంపించనున్నారు. పరివర్తనాత్మక నైపుణ్య అవకాశాలను విద్యార్థుల వద్దకే తీసుకెళ్లేందుకు ఇన్ఫోసిస్ భాగస్వామ్యం కావడం అభినందనీయని లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి జి. గణేష్ కుమార్, నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, ఇన్ఫోసిస్ సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.
Previous Articleఅత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘మహా కుంబమేళా’ ఏర్పాట్లు
Next Article మరోసారి తన దాతృత్వం చూపిన ఎలాన్ మస్క్