ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం (88) తుది శ్వాస విడిచారు.గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబయిలోని జస్‌లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు.పోఖ్రాన్ న్యూక్లియర్ పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.చెన్నైలో జన్మించిన రాజగోపాల చిదంబరం..బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) డైరెక్టర్‌గా వ్యవహరించారు.అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గానూ పని చేశారు.అణుశక్తి విభాగం కార్యదర్శిగా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పనిచేశారు. ఆయన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 1999లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.
Previous Articleసౌరభ్ గంగూలీ కుమార్తె కారును ఢీకొట్టిన బస్సు …!
Next Article ఒరిస్సాలో కనిపించిన అరుదైన నల్ల చిరుత …!