ఒడిశాలోని నయాగఢ్ అడవుల్లో అరుదైన మెలానిస్టిక్ చిరుతపులి కనిపించింది.నోట్లో తన పిల్లను పట్టుకుని తిరుగుతున్న నల్ల చిరుత కెమెరాకు చిక్కింది.అడవిలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో చిరుతపులి కదలికలను గుర్తించామని ప్రినిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రేమ్ కుమార్ జా వెల్లడించారు.ఈ అరుదైన నల్ల చిరుత మధ్య ఒరిస్సాలో కనిపించిందని,దీనితో పాటు పిల్ల కూడా ఉందని చెప్పారు.ఇది ఈ ప్రాంత అద్భుతమైన జీవవైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.అయితే పర్యావరణ వ్యవస్థకు నల్ల చిరుతలు చాలా ముఖ్యమైనవని పేర్కొన్నారు.వాటి నివాసాలను రక్షించడమనేది అభివృద్ధి చెందుతున్న వన్యప్రాణుల వారసత్వాన్ని నిర్ధారిస్తుందని తెలిపారు.
Previous Articleప్రముఖ అణు శాస్త్రవేత్త కన్నుమూత
Next Article జాన్వీతో సినిమా చేయను: రామ్ గోపాల్ వర్మ