బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషను పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేస్తోన్న నిరసనకు మద్దతు తెలిపారు ఒకప్పటి ఎన్నికల వ్యూహకర్త అయిన జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్.పట్నాలోని గాంధీ మైదాన్‌లో మహాత్ముడి విగ్రహం వద్ద జరిగిన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆ మైదాన్ పక్కనే పీకే కోసం ఓ లగ్జరీ వ్యాను సిద్ధంగా ఉండటం చర్చనీయాంశమైంది.నెటిజన్లు, రాజకీయ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై జన్‌సురాజ్ పార్టీ ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ఇక్కడ వ్యాను సమస్య కాదు, విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం.పీకే ప్రతిష్ఠకు భంగం కలిగించేందుకే దానిని మధ్యలోకి లాగుతున్నారు’’ అన్నారు.
Previous Articleక్లీంకారను ఆరోజు అందరికీ చూపిస్తా – రామ్‌చరణ్
Next Article మరో అద్భుతం చేసిన ఇస్రో: ‘క్రాప్స్’ ప్రయోగం విజయవంతం