హిమాలయ దేశం నేపాల్‌ను వరుస భూకంపాలు వణికించాయి.ఈరోజు ఉదయం 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది.అనంతరం స్వల్ప తీవ్రతతో మరో రెండుసార్లు ప్రకంపణలు వచ్చాయి.కాగా టిబెట్ కేంద్రంగా సంభవించిన ఈ భూకంపం ధాటికి భారీగా ఆస్తి,ప్రాణ నష్టం సంభవించింది.నేపాల్‌తోపాటు చైనా,భారత్‌లోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.ఈ భూకంపం ధాటికి కనీసం 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నుండి వచ్చిన సమాచారంతో ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.అదే సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపింది.
చైనాకు చెందిన మానిటరింగ్ ఏజెన్సీ మాత్రం భూకంప తీవ్రతను 6.8గా పేర్కొన్నది.టిబెల్ రాజధాని లాసాకు సుమారు 380 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు సమాచారం.టిబెట్‌లో రెండో అతిపెద్ద నగరమైన షిజాంగ్‌లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.కాగా షిజాంగ్ ప్రాంతంలోనే మరో రెండుసార్లు భూమి కంపించిందని,వాటి తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.7, 4.9గా నమోదయిందని పేర్కొంది.