కెనడా ప్రధాన మంత్రి పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుండి కూడా తప్పుకోనున్నట్లు తెలిపారు. తన తదుపరి ప్రధానిని పార్టీ ఎంపికచేసే వరకూ ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. గత కొంత కాలంగా తమ పార్టీ నేతల నుండే ట్రూడో వైదొలగాలని డిమాండ్ లు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈమేరకు రాజీనామా చేశారు. పార్టీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్న విషయాన్ని పార్టీకి, గవర్నర్ కు తెలిపాను. కొత్త నాయకత్వం ఎన్నుకోబడిన అనంతరం రాజీనామా చేస్తా. ఈ ప్రక్రియ కొనసాగించేందుకు మార్చి 24వరకు పార్లమెంటును ప్రొరోగ్ చేస్తున్నానని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. కెనడా లా ప్రకారం అధికార పార్టీ నేత రాజీనామా చేస్తే 90 రోజుల్లో కొత్త నాయకత్వాన్ని ఎన్నుకోవాలి.
Previous Articleఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో దిగజారిన భారత్…!
Next Article నేపాల్ – టిబెట్ – భారత్ లో కంపించిన భూమి…!

