భారత్ పోల్ పోర్టల్ ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దేశంలో భారీస్థాయిలో ఆర్థిక నేరాలకు పాల్పడి, ఇక్కడి దర్యాప్తు సంస్థల నుండి తప్పించుకుని ఇతర దేశాలకు పారిపోయే వారిని కట్టడి చేసేందుకు ఇది దోహదం చేయనుంది. విదేశాలకు మకాం మార్చిన నేరస్తులను దర్యాప్తు సంస్థలు భారత్ తిరిగి తీసుకువచ్చేందుకు ‘భారత్ పోల్’ విభాగం తగిన చర్యలు తీసుకోనుంది. అంతర్జాతీయ స్థాయి కేసుల దర్యాప్తును వేగవంతం చేసేందుకు ‘భారత్ పోల్’ ను తీసుకొచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఇప్పటి వరకు ఇంటర్ పోల్ తో భారత్ తరపున సీబీఐ మాత్రమే సమన్వయం చేసుకునేదని, ఇకపై భారత్ పోల్ పోర్టల్ ద్వారా దేశానికి చెందిన ప్రతి దర్యాప్తు సంస్థ, అన్ని రాష్ట్రాల పోలీసులు నేరుగా ఇంటర్ పోల్ తో సంప్రదించవచ్చని తెలిపారు. ఇందుకు గానూ మూడు నేర చట్టాలపై రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చే బాధ్యతను సీబీఐ తీసుకుంటుందని అమిత్ షా పేర్కొన్నారు.
భారత్ పోల్ పోర్టల్ ను ప్రారంభించిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
By admin1 Min Read
Previous Articleగేమ్ ఛేంజర్.. ‘కొండ దేవర’ వచ్చేసింది..!
Next Article ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం…!