అమెరికాలోని లాస్ ఏంజెలెస్ ను కార్చిచ్చు చుట్టుముట్టింది.కార్చిచ్చు కారణంగా అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భారీ స్థాయిలో ఆస్తి నష్టం ఏర్పడుతుంది.వేలాది ఎకరాల్లోని విలాసవంతమైన ఇళ్లు అగ్నికి ఆహుతి అవుతున్నాయి.అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తనయుడి ఇల్లు సైతం కాలి బూడిదైనట్లు తెలుస్తోంది.జోబైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కు మాలిబులో ఇల్లు ఉంది.ఈ మంటల్లో అది కాలి బూడిదైనట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి.ఇంటిముందు ఉంచిన కారు సైతం కాలిపోయిందని రష్యన్ టెలివిజన్ తెలిపింది.ఈ ఘటనపై తనకు సరైన సమాచారం లేదని జో బైడెన్ విలేకరులతో పేర్కొన్నారు.
Previous Articleహాలీవుడ్ ను చుట్టు ముట్టిన కార్చిచ్చు…!
Next Article వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియ: ప్రకటించిన ఇస్రో