ఇస్రో ఈరోజు నిర్వహించాల్సిన డాకింగ్ (అనుసంధాన) ప్రక్రియ మళ్లీ వాయిదా పడింది. ముందుగా ఈ నెల 7వ తేదీనే డాకింగ్ నిర్వహించాలని ఇస్రో భావించినప్పటికీ సాంకేతిక కారణాలతో 9వ తేదీకి వాయిదా పడింది. రెండు ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేయడమే లక్ష్యంగా స్పేస్ డాకింగ్ ప్రయోగాన్ని ఇటీవల ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే.
అయితే తాజాగా రెండు శాటిలైట్స్ మధ్య దూరాన్ని 225 మీటర్లకు చేర్చేందుకు ఓ పక్రియ నిర్వహించగా, రెండింటి మధ్య దూరం ఊహించిన దాని కంటే ఎక్కువ ఉన్నట్లు తేలింది. దీంతో నేడు నిర్వహించాలనుకున్న డాకింగ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన ఇస్రో శాటిలైట్స్ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. అయితే డాకింగ్ తదుపరి తేదీని మాత్రం ప్రకటించాల్సి ఉంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు