ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆ పార్టీకి 25 సంవత్సరాలుగా అధికారం ఇవ్వలేదని ఢిల్లీని దేశ నేర రాజధానిగా మారుస్తుందంటూ ఇక్కడి ప్రజలపై ద్వేషం పెంచుకుందని తీవ్ర విమర్శలు చేశారు. ఇక రోహింగ్యా చొరబాటు దారుల పేరుతో పూర్వాంచల్, దళితుల ఓట్లను భారీగా తొలగిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే అపార్ట్మెంట్లకు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకునేందుకు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కు నిధులు మంజూరు చేస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మరోవైపు పూర్వాంచల్ ఓటర్లపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పూర్వాంచల్ సమ్మాన్ మార్చ్ పేరుతో కేజ్రీవాల్ నివాసం బయట బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనాన్స్ ప్రయోగించారు దీంతో ఉద్రిక్తత నెలకొంది. కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఢిల్లీ లోని 70 అసెంబ్లీ స్థానాలకు గాను ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆప్ హోరాహోరీగా పోటీపడుతున్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు