కేరళలోని శబరిమల ఆలయాన్ని పర్యవేక్షించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) యాత్రికుల కోసం ఉచిత ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీబీ వెల్లడించింది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించనుంది.పథనంథిట్ట, కొల్లం, అలప్పుజ,ఇడుక్కి జిల్లాల్లో ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల పరిహారం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.ఇందుకు గాను యాత్రికుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదని పేర్కొన్నారు.వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ చేసుకున్న భక్తులకు ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది ప్రకటించింది.
Previous Articleవిజయ్ హజారే ట్రోఫీలో సెమీఫైనల్ చేరిన కర్ణాటక, మహారాష్ట్ర
Next Article కాలికి గాయంతో రష్మిక ఫొటో