ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కు కొత్త ఛైర్మన్ గా వి.నారాయణన్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు ఆయన లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ (ఎల్పీఎస్సీ)కు డైరెక్టర్ గా పనిచేశారు. ఆయన తన కెరీర్లో 26కు పైగా అవార్డులు సాధించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఎఫ్) ప్రొపల్షన్ కమిటీ, అంతర్జాతీయ ఖగోళశాస్త్ర అకాడమీ, ఇండియన్ సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ సైన్స్ మొదలైన వాటిల్లో సభ్యులుగా ఉన్నారు. తాజాగా బాధ్యతలు అందుకున్న నారాయణన్ ను అభినందిస్తూ అంతరిక్షశాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రానున్న రోజుల్లో కీలకమైన అంతరిక్ష మిషన్లకు నాయకత్వం వహించాల్సిన నారాయణన్.. ప్రధాని మోడీ దార్శనికతను సాకారం చేయాలని ఆకాంక్షించారు.
Pic source:isro x
Previous Articleవిజయ్ హజారే టోర్నీలో ఫైనల్ చేరిన కర్ణాటక
Next Article వీటి చేరికతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరగనుంది