దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి. ఉదయం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించిన సూచీలు ఆద్యంతం అదే జోరును కనబరిచాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 318 పాయింట్లు లాభపడి 77,042 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ 98 పాయింట్ల లాభంతో 23,311 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.61గా కొనసాగుతోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకి, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్.బీ.ఐ, బజాజ్ ఫిన్ సర్వ్, భారతీ ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
Previous Article8వ పే కమిషన్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Next Article భారత్ కు మెటా ఇండియా క్షమాపణ..!