ఇప్పటికే పలుమార్పులు తీసుకొచ్చి ఉద్యోగుల వెతలు తీర్చిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్ఓ) తాజాగా ఉద్యోగులకు అనుకూలంగా మరో నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎకౌంటుల బదిలీని మరింత సులభం చేసింది. యాజమాన్యాలతో ప్రమేయం లేకుండా, వారి అనుమతి లేకుండానే ఉద్యోగులు ఎవరికి వారే తమ ఖాతాలను బదిలీ చేసుకునే వెసులుబాటును తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యాజమాన్యాల చుట్టూ తిరగే శ్రమ, టైం వేస్ట్ ఉండదు. కాగా, ఈ సదుపాయం 2017 అక్టోబర్ 1వ తేదీ తర్వాత జారీ అయిన యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్)తో ఆధార్ అనుసంధానమైన ఖాతాలకు మాత్రమే వర్తిస్తుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. వ్యక్తిగత వివరాల్లో మార్పులు, అకౌంట్ ట్రాన్స్ఫర్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు దానిని ఉపసంహరించుకుని, ఆన్లైన్లో ఎవరికి వారే ఈ మార్పులు చేసుకోవచ్చు. అయితే, 2017కు ముందు నాటి ఖాతాలకు మాత్రం ఇది వర్తించదు. అదివరకు లాగా మామూలుగానే వారి యాజమాన్యాలే వీటిని చేయాల్సి ఉంటుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు