దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పశ్చిమ బెంగాల్ లోని ఆర్జీకర్ హాస్పిటల్ డాక్టర్ హత్యాచారం కేసులో దోషి సంజయ్ రాయ్ కు కోల్ కతా లోని సీల్దా కోర్టు నేడు శిక్ష ఖరారు చేసింది. అతడికి జీవితఖైదును విధించింది. అలాగే బాధిత కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటన అరుదైన కేసు కేటగిరీలోకి రాదని వ్యాఖ్యానించింది. మరణశిక్ష విధించకపోవడానికి ఇదే కారణమని పేర్కొంది. ఈ శిక్ష ఖరారు చేయడానికి ముందు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. తనను ఈ కేసులో తప్పుగా ఇరికించారని సంజయ్ రాయ్ తన వాదన వినిపించాడు. గతఏడాది ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆసుపత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న నిరసనలకు దారితీసింది. పశ్చిమ బెంగాల్ హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును కోల్ కతా పోలీసుల నుండి సీబీఐ తీసుకుని విచారించింది. ఇందులో భాగంగా ప్రత్యేక కోర్టుకు అభియోగాలు సమర్పించింది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్ షీట్లో చేర్చింది. హాస్పిటల్ ఆవరణలోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్ ను ఆగస్టు 10న కోల్ కతా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆర్జీకర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కు శిక్ష ఖరారు చేసిన సీల్దా కోర్టు
By admin1 Min Read

