ఏదైనా మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు నెట్వర్క్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని అందరూ ఏదో ఒక సమయంలో అనుభవించి ఉంటారు. మనం వినియోగించే నెట్వర్క్ తాలుకు సిగ్నల్ లేకపోయినా వేరొక నెట్వర్క్ నుండి సిగ్నల్ ను వినియోగించుకునే సదుపాయంతో ఈ సమస్యను అధిగమించవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని దేశంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు టెలికాం డిపార్ట్మెంట్ (డాట్) ప్రకటించింది. దీని ద్వారా.. జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు.. తమ సొంత సెల్యులార్ టవర్ల రేంజ్లో లేనప్పటికీ.. ఇతర టెలికం నెట్వర్క్లను వినియోగించుకుని 4జీ సేవలను పొందొచ్చు. డిజిటల్ భారత్ నిధి(డీబీఎన్) కింద ఏర్పాటైన టవర్ల ద్వారా ఈ సేవలు ఉపయోగించుకునే సౌలభ్యం ఉంది. టెలికం యాక్ట్-2023 కింద భారత ప్రభుత్వం ఈ డీబీఎన్ ను ఏర్పాటు చేసింది. ఐసీఆర్ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు.
‘టెలికం సర్వీస్ ప్రొవైడర్లయిన బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో సంస్థలు ఇలా అన్ని డీబీఎన్ సైట్స్లో ఒకరికొకరు తమ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. ఇటువంటివి 27,836 సైట్లు ఉన్నాయి. వీటి ద్వారా 35,400 మారుమూల గ్రామాలకు 4జీ అనుసంధానం లభిస్తుందని వివరించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు