ఏపీకి పెట్టుబడులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఆయన వరుస సమావేశాలతో ఆయన బృందం బిజీబిజీగా గడుపుతున్నారు. సీఎం చంద్రబాబు నేడు ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మీ అందర్నీ చూస్తుంటే నాలో నమ్మకం పెరిగింది. భవిష్యత్‌లో నా కలలు నిజమవుతాయనే నమ్మకం కలిగింది. రెండున్నర దశాబ్దాల్లో హైదరాబాద్ అభివృద్ధి చెందింది. భారత్‌లో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. హైదరాబాద్‌లో అన్ని రంగాలను అభివృద్ధి చేశాం. ఇంటర్నెట్, ఆర్థిక సంస్కరణలను వినియోగించి రెండో తరం సంస్కరణలు ప్రవేశపెట్టానని ఆయన పేర్కొన్నారు. నేను ప్రతి సారీ తప్పకుండా దావోస్ వస్తున్నా. గ్లోబల్ గా వస్తున్న కొత్త డెవలప్మెంట్స్ ఏంటి , వాటిని ఎలా అందిపుచ్చుకోవాలి లాంటివి ఇక్కడ నేర్చుకుంటున్నానని చంద్రబాబు వివరించారు. పలువురు ప్రముఖు పారిశ్రామిక వేత్తలను ఆయన కలిశారు.
Previous Articleఏపీలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు
Next Article దేశంలో ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) సదుపాయం