ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నుంచి వైదొలగాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించిన నేపథ్యంలో చైనా కీలక ప్రకటన చేసింది.యూఎస్‌ఏ వైదొలిగినా డబ్ల్యూహెచ్‌వోకు తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అనూహ్య నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.అందులో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా వైదొలగడం.కొవిడ్ వ్యాప్తి సమయంలో ఈ సంస్థ బాధ్యతారాహిత్యంగా వ్యవహిరించినందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నేపథ్యంలో చైనా స్పందించింది.డబ్ల్యూహెచ్‌వోకు తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించింది.ప్రపంచ ఆరోగ్య సంస్థను మరింత బలోపేతం చేయాలి తప్ప..బలహీన పరచకూడదని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి జియాకున్ పేర్కొన్నారు.డబ్ల్యూహెచ్‌వో కార్యకలాపాలకు చైనా సహకారం ఉంటుందన్నారు.ఆరోగ్యకర ప్రపంచం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తామన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు