తాగుబోతు భర్తల వేధింపులతో విసిగిపోయిన ఇద్దరు మహిళలు పరస్పరం పెళ్లాడి కొత్తజంటగా అవతరించారు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో ఈ వింత ఘటన జరిగింది.గోరఖ్‌పుర్‌కు చెందిన కవిత, గుంజా అలియాస్ బబ్లూ అనే మహిళలు దేవరియాలోని శివాలయంలో వివాహం చేసుకున్నారు. తమ భర్తల మద్యపాన అలవాట్లు, వేధింపుల కారణంగా విసిగిపోయిన వీరిద్దరికీ మొదట ఇన్‌స్టాగ్రాంలో పరిచయం ఏర్పడి స్నేహితులుగా మారారు.ఇద్దరూ గృహహింస బాధితులు కావడంతో భర్తలను విడిచిపెట్టాలన్న నిర్ణయానికి వచ్చారు.ఈ క్రమంలోనే ఆలయంలో గుంజా వరుడిగా మారి కవిత నుదుట తిలకం దిద్దారు. దండలు మార్చుకొని, ఏడడుగులు నడిచారు. ‘‘ప్రేమ, శాంతితో కూడిన జీవితాన్ని గడపడానికి మేము పెళ్లి చేసుకున్నాం. గోరఖ్‌పుర్‌లోనే నివాసం ఉంటాం’’ అని గుంజా తెలిపారు. వీరి పెళ్లిపై శివాలయం పూజారి శంకర్‌పాండే స్పందిస్తూ.. మహిళలిద్దరూ పూలదండలు, సిందూరం తెచ్చి పూజలు చేసి వెళ్లిపోయారని తెలిపారు.
Previous Articleప్రతి నెలా రూ.25 వేల ప్రయోజనం: కేజ్రీవాల్
Next Article ఆ పులిని చంపేయండి:- కేరళ ప్రభుత్వం