కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ ఇటీవల ఓ హెచ్చరిక చేశారు.ఈ మేరకు కాస్మిటిక్ ఉత్పత్తుల్లో అధిక స్థాయిలో మెర్క్యూరీ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు.అయితే మెర్క్యూరీ స్థాయి ఎక్కువగా ఉన్న ఉత్పత్తుల్ని కేరళలో అమ్ముతున్నట్లు ఆమె పేర్కొన్నారు.కాస్మటిక్ ఉత్పత్తులను లైసెన్స్ కంపెనీలు అమ్ముతున్నాయా లేదా అన్న విషయాన్ని చెక్ చేసుకోవాలని ఆమె తన ఫేస్‌బుక్ పోస్టులో వెల్లడించారు.ఇలాంటి ప్రోడక్ట్‌ను కొనేముందు ఉత్పత్తిదారుడి అడ్రస్‌ను తెలుసుకోవాలని కోరారు.కేరళ రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ సౌందర్యను మొదలుపెట్టామని తెలిపారు.
కాస్మటిక్ ఉత్పత్తుల్లో ప్రమాదకర కెమికల్స్ కోసం అన్వేషిస్తున్నారు.ఫేక్ ఉత్పత్తుల్ని సీజ్ చేస్తున్నారు.2023లో తొలిసారి ఈ ఆపరేషన్ మొదలైంది.రెండు దశల్లో దీన్ని చేపట్టారు.ఆ సమయంలో 7 లక్షల ఖరీదైన నకిలీ కాస్మటిక్ ఉత్పత్తుల్ని సీజ్ చేశారు.ఇలాంటి ప్రమాదకర రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అయ్యే ఛాన్సు ఉన్నట్లు,కొన్ని సందర్భాల్లో అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.ఫిర్యాదుల నమోదు కోసం టోల్ ఫ్రీ నెంబర్ జారీ చేశారు.