వక్ఫ్ సవరణ బిల్లును ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పార్లమెంటుకు తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకురావడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశమని కేంద్రం స్పష్టం చేసింది. రేపటి నుండి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి పలు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రవేశపెట్టే బిల్లుల లిస్ట్ ను కేంద్ర ప్రభుత్వం అఖిలపక్షాలకు అందించింది. ఈ లిస్టులో వక్ఫ్ బిల్లు కూడా ఉంది. ఈ బిల్లుతో పాటు 16 బిల్లులు సభలో ప్రవేశపెట్టనున్నారు. వక్ఫ్ చట్ట సవరణకు సంబంధించి ఇది వరకే కేంద్ర ప్రభుత్వం జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ బడ్జెట్ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లు: అఖిల పక్షానికి కేంద్రం లిస్ట్
By admin1 Min Read
Previous Articleరోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని కాపాడితే రూ.25 వేలు..!
Next Article డీఎస్‌పీ గా భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మ

