ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా నియమించింది. ఒక క్రికెటర్‌గా దేశానికి ఆమె చేసిన సేవను గుర్తించి ఈనెల 27న యూపీలోని మొరాదాబాద్ జిల్లాలో డీఎస్‌పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని దీప్తి తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా తనకు తగిన గౌరవం ఇచ్చినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మైలురాయిని సాధించినందుకు ఎంతో గర్వంగా ఉంది. డీఎస్‌పీ పోస్టుతో నా చిన్ననాటి కల నెరవేరింది. అన్ని విధాల నాకు తోడ్పాటు అందించిన నా కుటుంబానికి హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి అచంచలమైన మద్దతు, ఆశీర్వాదాలు నేడు నన్ను ఈ స్థాయిలో నిలబెట్టాయి. ఈ అవకాశం కల్పించినందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు . డీఎస్‌పీగా నా విధులను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని ఆమె పేర్కొన్నారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

