జమ్ముకశ్మీర్‌లో అక్రమమగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు కాల్చి చంపాయి.నిన్న రాత్రి పూంచ్ సెక్టార్‌లోని ఎల్ఓసి వద్ద ఇద్దరు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.అయితే భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు యత్నించగా, ఇరుపక్షాల మధ్య భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ మేరకు భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.అయితే నియంత్రణ రేఖ వద్ద రాత్రంతా కాల్పులు జరిగాయని, ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని వైట్ నైట్ కార్ప్స్ ఎక్స్ వేదికగా పేర్కొంది.అయితే ఆ ప్రాంతంలో గాలింపు చేపట్టామని తెలియజేసింది.
Terrorist movement detected in #Poonch sector along the #LineofControl.
Alert troops opened fire leading to a heavy exchange of fire.
Operations are underway.
#IndianArmy@adgpi@NorthernComd_IA— White Knight Corps (@Whiteknight_IA) January 30, 2025