యువగళం పాదయాత్ర లో హామీ ఇచ్చిన విధంగా ఆర్యవైశ్యుల ఇలవేల్పు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని రాష్ట్ర కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు . దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించడానికి జగజ్జనని పరమేశ్వరి కన్యక అవతారం దాల్చారు. తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన వాసవీ దేవి ఆత్మార్పణ చేస్తూ అగ్నిప్రవేశం చేశారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఈ సందర్భంగా లోకేష్ ఆకాంక్షించారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నాను: మంత్రి లోకేష్
By admin1 Min Read