ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా భారత్ స్వయం సమృద్ధి వైపు దూసుకు పోతున్న సమయంలో సరికొత్త ఏఐ సాంకేతిక పరిజ్ఞానం కూడా రూపొందించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చాట్ జీపీటీ, డీప్ సీక్ లకు దీటుగా ఇండియా ఏఐ మిషన్ లో భాగంగా త్వరలోనే భారత్ కూడా సొంత జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మోడల్ ను అభివృద్ధి చేయనుందని భువనేశ్వర్ లో ‘ఉత్కర్ష్ ఒడిశా’ సమావేశంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ ఏఐ మోడల్ పూర్తిగా ఇండియా ఏఐ కంప్యూటర్ సామర్థ్యంతో మన దేశంలోని లాంగ్వేజ్, కల్చరల్ వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అతితక్కువ ఖర్చుతో రూపొందించనున్నారు. ఈ ఏఐ మోడల్ డెవలప్మెంట్ కోసం గత నెలలుగా స్టార్టప్ లు, పరిశోధకులు, ఏఐ నిపుణుల బృందాలు పని చేస్తున్నాయి. ఇప్పటికే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) ఏఐ లో భారతదేశాన్ని గ్లోబల్ లీడర్ గా ఉంచాలనే లక్ష్యంతో 2025ని “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంవత్సరం”గా గుర్తించింది. ప్రభుత్వం కూడా ఏఐ కంప్యూట్ పవర్ కెపాసిటీ నెలకొల్పాలన్న లక్ష్యంతో “ఇండియా ఏఐ మిషన్” పేరిట 2029 వరకు రూ.10,371 కోట్లు కేటాయిస్తూ 2024 లో ఆమోదం తెలిపింది. ఈ మిషన్ దేశంలోని స్టార్టప్ లు మరియూ ఏఐ ఇన్నోవేటర్లకు అవసరమయ్యే సౌకర్యాలను అందిస్తుంది. ఈ మిషన్ ద్వారా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం, లాజిస్టిక్స్ రంగాలలో రూపొందించే ఏఐ అప్లికేషన్లను కేంద్రప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
Previous Articleఅత్యాచారం కేసులో తమిళనాడు మహిళా కోర్టు సంచలన తీర్పు..!
Next Article అండర్ 19 టీ20 ప్రపంచ కప్ ఫైనల్ చేరిన భారత్