బడ్జెట్ -2025 ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు.ఈ మీకు వేతన జీవులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది.కాగా రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుండి మినహాయింపు కల్పించింది.అయితే పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు.అలాగే శ్లాబులను కూడా తగ్గించామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.రూ.12 లక్షలకు మించిన ఆదాయం ఉన్నవారికి శ్లాబులవారీగా పన్నులను నిర్ణయించారు.రూ.20లక్షల నుంచి రూ.24 లక్షల వరకు 25 శాతం పన్నుగా నిర్ణయించారు.రూ.16 లక్షల నుంచి 20లక్షల్లోపు ఆదాయంపై 20 శాతం పన్నుగా నిర్ణయించారు.
కేంద్రప్రభుత్వం తాజా నిర్ణయం మేరకు రూ.18 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.70 వేల వరకు లబ్ధి చేకూరనుంది.అలాగే రూ.25 లక్షల వరకు ఆదాయం వచ్చే వారికి రూ.1.10 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.అయితే టీడీఎస్, టీసీఎస్ రేట్లను కూడా కేంద్రం భారీగా తగ్గించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.వృద్ధులకు వడ్డీపై వచ్చే ఆదాయంపై రూ.50 వేల నుండి రూ. లక్ష వరకు పెంచామని చెప్పారు.అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై రూ.2.4 లక్షల నుండి రూ.6 లక్షల వరకు ఆదాయపు పన్ను నుండి మినహాయిస్తున్నట్లు వెల్లడించారు.