ప్రతిష్టాత్మక గ్రామీ పురస్కారాల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెల్స్ వేదికగా ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్లు హాజరయ్యారు . కాగా ఈ వేడుకల్లో అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు గ్రామీ అవార్డు లభించింది. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్ (100) గతేడాది డిసెంబర్ 30న మరణించిన విషయం తెలిసిందే. మరణానంతరం ఆయనను ఈ అవార్డు దక్కింది. ఆయన రచించిన ‘ది లాస్ట్ సండేస్ ఇన్ ప్లేన్స్’కు బెస్ట్ ఆడియోబుక్ నేరేషన్ విభాగంలో అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన మనవడు జేసన్ కార్టర్ అందుకున్నారు. జిమ్మీ కార్టర్ అమెరికాకు 39వ అధ్యక్షుడిగా సేవలందించారు. తన ప్రపంచ శాంతి కోసం ఎనలేని కృషి చేసిన ఆయనకు 2002లో నోబెల్ శాంతి బహుమతి లభించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కు మరణానంతరం ప్రతిష్టాత్మక గ్రామీ అవార్డు
By admin1 Min Read
Previous Articleవసంత పంచమి వేళ కుంభమేళాకు భారీగా హాజరైన భక్తులు…!
Next Article లోక్ సభలో గందరగోళం…!