దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపలేకపోయాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగిన సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ‘మేకిన్ ఇండియా ‘ మంచి ఆలోచనే అయితే దానిని అమలు చేయడంలో మోడీ విఫలమయ్యారని పేర్కొన్నారు. దేశం భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని మనం మాట్లాడేది ఏదైనా యువత గురించే ఉండాలని అన్నారు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం అయినప్పటికీ నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయాం. గత యూపీఏ, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి కల్పనలో దేశంలోని యువతకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేక పోయాయని అన్నారు. ఉత్పత్తి రంగంలో మనం నిలదొక్కుకోక పోవడం వల్ల చైనా అందులో మకాం వేసిందన్నారు. ఇప్పటికైనా మనం తయారీ రంగంపై పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు.
నిరుద్యోగ సమస్యకు యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు సరైన పరిష్కారం చూపలేకపోయాయి
By admin1 Min Read