ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది.యూపీలోని
మిల్కిపూర్,తమిళనాడులోని ఈరోడ్ (తూర్పు)
నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు
వినియోగించుకుంటున్నారు.సమాజ్వాదీ పార్టీ
ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో యూపీలోని
మల్కిపురిలో ఉపఎన్నిక అనివార్యమైంది.ఎస్సీ
రిజర్వ్ స్థానమైన మిల్కిపూర్ నుంచి గత
ఎన్నికల్లో అవదేశ్ ప్రసాద్ ఎమ్మెల్యేగా
గెలుపొందారు.అయితే ఆ తర్వాత జరిగిన
పార్లమెంట్ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానం నుంచి
పోటీ చేసి విజయం సాధించారు.దీనితో ఆయన
తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.ఉపఎన్నిక పోలింగ్ ఈరోజు జరుగుతుంది.నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉన్నారు.10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ..అధికార బీజేపీ, సమాజ్వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
Previous Articleప్రజాస్వామ్య పండుగలో ఉత్సాహంతో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకోవాలి: – ప్రధాని మోదీ
Next Article స్వాధీనం చేసుకుంటాం:గాజాపై ట్రంప్ కీలక నిర్ణయం