ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఆయన ఇజ్రాయెల్ -హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. గాజాను స్వాధీనం చేసుకుని అక్కడ ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. ఆర్థికంగా అభివృద్ధి చేసి అక్కడి ప్రజలకు ఉపాధి ఉద్యోగాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై నెతన్యాహు స్పందించారు. ఈ నిర్ణయం చరిత్రను మారుస్తుందని అభిప్రాయపడ్డారు. కాగా, యుద్ధంతో గాజాలో నిరాశ్రయులుగా మారిన పాలస్తీనా ప్రజలకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాను తామే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అయితే, ట్రంప్ ప్రకటన పట్ల హమాస్ తీరు వేరే విధంగా ఉంది. ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలు పెంచేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Previous Articleడిల్లీలో పాటుగా మరో రెండు చోట్ల ఉప ఎన్నికల పోలింగ్ …!
Next Article రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం?