కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఢిల్లీ లోని ఆయన నివాసంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా కలిసారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఈసందర్భంగా వారికి లోకేష్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. డిఫెన్స్ రంగం పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఎపికి వచ్చేలా సహకరించాలని అడిగారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనుల పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్ నాథ్ సింగ్ కు వివరించినట్లు లోకేష్ తెలిపారు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.కేంద్ర మంత్రులు శ్రీనివాసరాజు, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, హారీష్ బాలయోగి, సీఎం రమేష్ తదితరులు రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన వారిలో ఉన్నారు.
ఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ ను కోరిన ఏపీ మంత్రి లోకేష్
By admin1 Min Read
Previous Articleశంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికుల ఆందోళన..!
Next Article అమెరికా నుండి భారత్ చేరుకున్న అక్రమ వలసదారుల విమానం