అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పినట్లు అక్రమ వలసలపై కొరడా ఝళిపించారు. కొంతమంది భారతీయులను కూడా అమెరికా నుండి వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. టెక్సాస్ నుండి బయలుదేరిన అమెరికా సైనిక విమానం సీ-17 ఈరోజు పంజాబ్ లోని అమృత్ సర్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది. వీరిని అవసరమైన తనిఖీలు తర్వాత ఎయిర్ పోర్ట్ నుండి బయటకు పంపించనున్నట్లు తెలుస్తోంది. వీరిని అమెరికా నుండి వెనక్కి పంపించే ముందు ప్రతి ఒక్కరి రికార్డులను పరిశీలించినట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో మరికొన్ని విమానాలు భారత్ కు రానున్నట్లు తెలిపారు. అక్రమ వలసదారుల పై ట్రంప్ మొదటి నుండి చాలా కఠినంగా ఉంటున్నారు. ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చర్యలు వేగవంతం చేశారు. ఇక భారత్ కూడా అక్రమ వలసలపై అమెరికా అనుసరిస్తున్న విధానాలపై తమ స్పందనను తెలిపింది. అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. వీసా గడువు ముగిసినా సరైన డాక్యుమెంట్లు లేకుండా భారతీయులు అమెరికాతో సహా ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకొచ్చేందుకు వీలు కల్పిస్తామని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
Previous Articleఏపీలో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ ను కోరిన ఏపీ మంత్రి లోకేష్
Next Article భారీ లాభాలలో దేశీయ స్టాక్ మార్కెట్లు