దశాబ్దానికి పైగా ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైంది. అత్యధిక స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఎన్నికల ఫలితాలు అధికార ఆప్ ను నిరాశ కలిగించాయనే చెప్పాలి. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సత్యేందర్ జైన్ వంటి అగ్రనేతలు పరాజయం పాలయ్యారు. ఇక ఈ ఓటమిపై అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ప్రజల తీర్పును అంగీకరిస్తున్నామని, ప్రజా నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లం తెలిపారు. ఎన్నికల్లో విజయం అందుకున్న బీజేపీకి అభినందనలు తెలిపారు. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని, ఈ ఎన్నికల ఫలితాలతో తన స్ఫూర్తి దెబ్బతింటుందని భావించడంలేదని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ శక్తి వంచన లేకుండా కృషి చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. గత పదేళ్లలో ఢిల్లీలో తాగునీరు, విద్యుత్ సహా అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చామని వివరించారు. ఎన్నికల్లో ఓటమి చెందినా నిరంతరం ప్రజల కోసం పోరాడుతూ వారి వెంటే ఉంటామని పేర్కొన్నారు.
ప్రజల తీర్పును శిరసావహిస్తాం…వారి వెంటే ఉంటాం: ఎన్నికల్లో ఓటమిపై స్పందించిన కేజ్రీవాల్
By admin1 Min Read