అవినీతి రహిత రాజకీయాలనే నినాదంతో ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ఊబిలో పీకల లోతు కూరుకుపోయింది.కాగా ప్రస్తుత ఓటమికి కారణం ఇదే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే గత ఏడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఆ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ పై ఆరోపణలు రావడం ఆప్ కు భారీగా నష్టం చేసిందని చెబుతున్నారు.ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దారుణమైన ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇందులో ఒకటి లిక్కర్ స్కాంలో ఆప్ నేతలు జైలుకు వెళ్లడం,మరొకటి శీష్ మహల్ పునర్నిర్మాణం కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారనే…ఈ ఆరోపణలు రెండో కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తి చేశారు.అయితే అవినీతికి వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడాన్ని ఢిల్లీ ఓటర్లు జీర్ణించుకోలేకపోయారు.అదేవిధంగా తాను సామాన్యుడినని,ఆడంబరాలకు,ఆర్భాటాలకు దూరంగా ఉంటానని పదే పదే వ్యాఖ్యానించే కేజ్రీవాల్ తన అధికారిక భవనం శీష్ మహల్ మరమ్మతుల కోసం భారీ మొత్తంలో ప్రభుత్వ నిధులను వినియోగించారనే ఆరోపణలు కూడా ఓటర్లను ప్రభావితం చేశాయని భావిస్తున్నారు.