ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది.ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.ఆప్ సీనియర్ నాయకులంతా ఊహించని రీతిలో పరాజయం పాలయ్యారు.ముఖ్యమంత్రి అతిషి మాత్రం స్వల్ప మెజారిటీతో గెలిచారు.ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 48 స్థానాలను కైవసం చేసుకుంది.ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితం అయ్యింది.కాంగ్రెస్ పార్టీ గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో లానే ఈసారి కూడా ఖాతా తెరువలేదు.కాంగ్రెస్ వరుసగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఖాతా తెరిచే పరిస్థితి కనిపించడం లేదు.అయితే దేశ రాజధానిలో కాంగ్రెస్ కనుమరుగైనట్లేననే రాజకీయ విశ్లేషణలు వ్యాఖ్యానిస్తున్నారు.షీలా దీక్షిత్ నాయకత్వంలో 1998 నుండి 2013 వరకు వరుసగా 3 సార్లు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఇలాంటి దుస్థితి ఉంది.
Previous Articleఢిల్లీ సెక్రటేరియట్ సీజ్…!
Next Article సూర్య ‘రెట్రో’ తెలుగు టీజర్ విడుదల…!