భారత్ తన సొంత వృద్ధినే కాకుండా ప్రపంచ వృద్ధి రేటును నడిపిస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన ఇండియా ఎనర్జీ వీక్-2025ను వర్చువల్ గా ప్రారంభించి మాట్లాడారు. ఈ 21వ శతాబ్దం మనదేనని ప్రపంచ నిపుణులు చెబుతున్నారు. మన స్వయం సమృద్ధినే కాకుండా ప్రపంచ వృద్ధి రేటును కూడా నడిపిస్తున్నాం. మన ఎనర్జీ రంగం కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వనరులు, ఆర్థిక బలం, మేధో సంపత్తి, రాజకీయ స్థిరత్వం మన దేశానికి ఉన్నాయి. సౌర ఉత్పత్తి సామర్థ్యం పెంచి మూడో అతిపెద్ద సోలార్ ఎనర్జీ ఉత్పత్తి దేశంగా నిలిచాడు. మన శిలాజేతర ఇంధన శక్తి 3 రెట్లు పెరిగింది. పారిస్ జీ20 ఒప్పందాల లక్ష్యాలు చేరుకున్న మొదటి దేశం మనది. రానున్న 5 సంవత్సరాలలో మరిన్ని సరికొత్త మైలురాళ్ళు దాటబోతున్నాం. 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గార గమ్యాన్ని నిర్దేశించుకున్నాం. ప్రతి ఏటా 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని మోడీ వివరించారు.
Previous Articleతప్పుడు ప్రచారాలను నమ్మవద్దు..1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article యాంకర్ రష్మీకి సర్జరీ…!