భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రముఖ వ్యాపారవేత్త టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఇరువురు వాషింగ్టన్ డీసీలో సమావేశమయ్యారు. ఈమేరకు వీరి భేటీ పై ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి అంశాలపై చర్చించినట్లు మోడీ ‘ఎక్స్’ లో తెలిపారు. సంస్కరణల వైపు భారత్ చేస్తున్న ప్రయత్నాల గురించి, ‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’ను మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఆయనతో మాట్లాడినట్లు వెల్లడించారు. బ్లెయిర్ హౌస్‌లో ఈ ఇద్దరు నేతలు సమావేశమయ్యారు. మస్క్ ముగ్గురు పిల్లలను కూడా ప్రధాని మోడీ కలిశారు. అలాగే యూఎస్ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ వాల్ట్‌జ్, వివేక్ రామస్వామితోనూ ప్రధాని సమావేశమై చర్చలు జరిపారు.
‘మినిమమ్ గవర్నమెంట్, మాగ్జిమమ్ గవర్నెన్స్’: మస్క్ తో భేటీ పై ప్రధాని మోడీ ట్వీట్
By admin1 Min Read