ఈ సంవత్సరం సెప్టెంబర్-అక్టోబర్ సమయానికి ‘మేడిన్ ఇండియా ‘ మొదటి చిప్ ను తీసుకురానున్నట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తాజాగా బెంగుళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెట్టుబడులు, మేడిన్ ఇండియా చిప్ గురించి మాట్లాడారు. మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.13,162 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. ఇంకా భారీ ఎత్తున రానున్నట్లు వెల్లడించారు. సెమీ కండక్టర్ల విషయంలో స్వావలంబన దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 234 యూనివర్సిటీలలోని విద్యార్థులకు తాజా సెమీకండక్టర్ డిజైన్ సాధనాలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0 ను పూర్తి చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ కృషి చేస్తుందని తెలిపారు. మొహాలీ లోని సెమీ కండక్టర్ ల్యాబ్ ఆధునీకరణ ఇంకా పెండింగ్లో ఉందని ఇది పూర్తి కాగానే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ 2.0 కోసం పని చేయనున్నట్లు తెలిపారు. ఇక తైవాన్ కు చెందిన పవర్ చిప్ సెమీకండక్టర్ మ్యానుఫాక్చరింగ్ కార్ప్ తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ గుజరాత్ లోని ధోలేరా లో సెమీ కండక్టర్ ఫ్యాబ్ ను నిర్మిస్తున్నట్లు తెలిపారు.
ఈ సంవత్సరంలోనే మొదటి ‘మేడిన్ ఇండియా ‘ చిప్: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్
By admin1 Min Read