అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి చెందారు. ఆమె వయసు 102 సంవత్సరాలు. సీనియర్ నటీమణి మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. అలనాటి నటి, సీనియర్ నిర్మాత 102 సంవత్సరాల పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్ ను చిత్ర రంగానికి పరిచయం చేసి కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాననీ చంద్రబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి: సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు
By admin1 Min Read